భార్యలపై దారుణాలు: ఇద్దరు భర్తల వికృత చేష్టలు

 TRUE TIMES INDIA
0

ఒకరు ముద్దు పేరుతో… మరొకరు కోపంతో ముక్కు కొరికిన ఘటనలు

దేశంలోని రెండు రాష్ట్రాల్లో భార్యలపై భర్తలు దారుణంగా ప్రవర్తించిన సంఘటనలు వెలుగుచూశాయి. ఒకరు ముద్దు పేరుతో భార్య ముక్కును కొరికేయగా, మరొకరు కోపంతో ముక్కును పూర్తిగా కొరికిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా గ్రామంలో ఓ భర్త తరచూ తన భార్యతో “నీ ముక్కు కొరికేయాలనిపిస్తోంది” అంటూ విచిత్రంగా ప్రవర్తించేవాడని సమాచారం. అయితే, ఇటీవల అర్ధరాత్రి సమయంలో తన కోరికను నిజం చేస్తూ భార్య ముక్కును కొరికేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఇక మరో ఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్‌లో ఓ భర్త భార్యతో గొడవకు దిగాడు. ఆగ్రహంతో అదుపు తప్పి భార్య ముక్కును పూర్తిగా కొరికి నమిలేశాడు. అంతేకాకుండా ఆమె బుగ్గలపై కూడా పలు చోట్ల (సుమారు 17 గాయాలు) కొరికినట్లు సమాచారం.
తరువాత భార్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించడంతో భయపడిన భర్త ఆమెను ఆసుపత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే చికిత్స అందించి కుట్లు వేశారు. తదుపరి ప్లాస్టిక్ సర్జరీ అవసరమని సూచించినట్లు తెలిసింది.
ఈ రెండు ఘటనలు కుటుంబ హింసపై ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!