ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా?

 TRUE TIMES INDIA
0


నష్టాలు, కార్యకలాపాల్లో అంతరాయాలే కారణమా

న్యూఢిల్లీ: Air India సీఈవోగా ఉన్న Campbell Wilson రాజీనామా చేసినట్లు సమాచారం వెలువడుతోంది. అయితే కొత్త సీఈవో నియామకం జరిగే వరకు ఆయన తన పదవిలో కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పలు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. గత వారం జరిగిన బోర్డు సమావేశంలో విల్సన్ రాజీనామాను ఆమోదించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇటీవల ఎయిర్‌లైన్ కార్యకలాపాల్లో అంతరాయాలు, పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఈ ఏడాది రికార్డు స్థాయిలో నమోదైన నష్టాలు వంటి కారణాలు ఈ నిర్ణయానికి దారితీసినట్లు సమాచారం. సంస్థ పనితీరుపై వచ్చిన ఒత్తిడి కూడా ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే ఈ అంశంపై ఎయిరిండియా నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!