అవగాహనతోనే రోగాలపై గెలుపు సాధ్యం

Malapati
0

 మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ పూర్తిగా మన చేతుల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉంటే అనేక ప్రాణాపాయ రోగాల నుంచి రక్షించుకోవచ్చని మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి పేర్కొన్నారు. వజ్రకరూర్ మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ మలేరియా దినోత్సవం అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..... మలేరియా వ్యాధి రహిత సమాజాన్ని నిర్మించడానికి స్వచ్ఛంద కార్యకర్తలు మండలాధికారులు ప్రజలు సహకరించాలన్నారు. ముఖ్యంగా ప్రజలు దోమతెరలు కచ్చితంగా వాడాలన్నారు. నీరు నిలవ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత గృహ యజమానులదే అన్నారు. ప్రతి శుక్రవారం నివాస గృహంలో నీటి తొట్టెలు, నీటి సంపులలో ఉన్న నీరు పూర్తిగా పారవేసి శుభ్రం చేసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రై డే ఖచ్చితంగా పాటించాలన్నారు. అనంతరం దోమకాటు పెనుముప్పు, దోమలను నిర్మూలిద్దం దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారిద్దాం, దోమ పుట్ట రాదు దోమ కుట్టరాదు అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మలేరియా వ్యాధి పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ గురు ప్రసాద్, కుమారస్వామి, హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ సత్యనారాయణ, సూపర్వైజర్ నాగ శంకర్, ఫార్మసిస్ట్ రామచంద్రనాయక్, హెల్త్ అసిస్టెంట్లు సంపత్ కుమార్, నాగరాజు, ఏఎన్ఎం లక్ష్మి, ఆశా కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!