జూన్ 7న అనంతపురంలో బెస్త సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

Malapati
0



 గంగపుత్రుల  ఐక్యతఊరు వాడా చాటుకోవాలి:హరి అనంతపురము:జిల్లా బెస్త సేవా సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈనెల జూన్ 7, 2026 (ఆదివారం) నాడు ఘనంగా జరగనుంది.

ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షులు *చేపల హరి*, ఉరవకొండ నియోజకవర్గఅధ్యక్షులు బెస్త హరి ఒక ప్రకటనలో అధికారిక ఆహ్వానాన్ని విడుదల చేశారు. అనంతపురము ఆదర్శ్ నగర్‌లోని గంగమ్మ, పోలేరమ్మ దేవాలయ సన్నిధిలో ఉన్న గంగపుత్ర కమిటీ హాల్ (జిల్లా బెస్త సేవా సంఘం భవనం) లో ఉదయం 10:00 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు..

ఈ వేడుకలో బెస్త సేవా సంఘం నూతన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి మరియు కార్యవర్గ సభ్యులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బెస్త సోదర సోదరీమణులు, సంఘ పెద్దలు మరియు కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో తరలిరావాలని జిల్లా అధ్యక్షులు చేపల హరి పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని తమ సొంత కుటుంబ వేడుకగా భావించి, హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.ఊరు వాడా ఆహ్వాన పత్రికలు పంపిణీ :ఈ మేరకుహరీ ఆధ్వర్యంలో కూడేరు, ఉరవకొండ, బెళుగుప్ప, ఇతర మండలాల్లో పెద్ద ఎత్తున ఆహ్వానపత్రికలు పంపిణీ చేశారు. గంగ పుత్రలు ఐక్యత చాటుకోవాలని హరి పిలుపు నిచ్చారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!