ఉరవకొండ: ఆమిద్యాల మేజర్ గ్రామ పంచాయతీలో పండగ వాతావరణం నెలకొంది. నియోజకవర్గ ఆశాజ్యోతి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి *వర్యులు పయ్యావుల కేశవ్ జన్మదిన వేడుకలు* అమిద్యాల గడ్డపై అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, గ్రామ ప్రజలు కలిసి ఈ వేడుకను ఒక జన జాతరలా మార్చేశారు.
'పీ' అంటే పవర్.. 'పీ' అంటే ప్రజా మనిషి!
ఈ వేడుకలకు ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరించిన సీనియర్ నాయకులు నారాయణ స్వామి మరో సీనియర్ నేత *దేవమ్మ* కేక్ కట్ చేసి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రిగారి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తారు:
*పవర్ ఫుల్ లీడర్: పీ అంటే కేవలం పేరు కాదు.. P** అంటే **Powerful* **P** అంటే **People's Man** (ప్రజల మనిషి)" అంటూ కార్యకర్తలు నినదించారు.
రాష్ట్ర రాజకీయాల్లో 'నెంబర్ 2':పయ్యావుల కేశవ్ గారు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగారని, రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనది 'నెంబర్ టు' స్థానమని నాయకులు నారాయణ స్వామి కొనియాడారు.
అభివృద్ధే ధ్యేయం:* ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి మినహా ఆయనకు మరో ఆలోచన లేదని, అందుకే ఆయన ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని దేవమ్మ పేర్కొన్నారు.
దీవెనల వెల్లువ.. శతమానం భవతి!
గ్రామస్తులందరూ ఏకమై "మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని" మనస్ఫూర్తిగా దీవించారు. కేక్ కటింగ్ అనంతరం గ్రామమంతా మిఠాయిలు పంచుతూ, టపాసులు పేలుస్తూ సంబరాలునారాయణ స్వామి, దేవమ్మ లతో గ్రామస్తులు కలిసి జరుపుకున్నారు.
ఉరవకొండ గడ్డ.. పయ్యావుల అడ్డా అని మరోసారి నిరూపిస్తూ, అమిద్యాల నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నేతపై ఉన్న ప్రేమని చాటుకున్నారు.

