యోగాంద్ర–2026: స్లోగన్స్ పోటీలో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం దక్కించుకున్న టి. రజని కుమారి


 

సొమలదొడ్డి: యోగాంద్ర–2026 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్లోగన్స్ పోటీలలో టి. రజని కుమారి జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. తన సృజనాత్మకతతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆమెకు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మరియు జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారం అందజేశారు.

ఈ ఘన విజయంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. యోగాపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో రజని కుమారి ప్రతిభ చూపడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జై కిసాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగమల్లి ఓబులేష్ మాట్లాడుతూ, రజని కుమారి విజయం యువతకు స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలో కీర్తిని తీసుకురావాలని ఆకాంక్షించారు. రజని కుమారి సాధించిన ఈ విజయానికి జై కిసాన్ ఫౌండేషన్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.