చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు
చిన్నారులకుపొంచి ఉన్న ప్రమాదం మలేరియా డెంగు బారిన పడే ప్రమాదం
హెల్త్ కేర్ సెంటర్ సిబ్బంది పర్యవేక్షణ లోపం కనీస పర్యవేక్షణ కరువైన వైనం
టిడిపి నాయకులు అడ్డుపడుతున్నారని పంచాయతీ సెక్రెటరీ వివరణ
కూడేరుమండలపరిధిలోని కలగళ్ల గ్రామంలోని స్థానిక అంబేద్కర్ నగర్ కాలనీలో ఎస్సీ కాలనీ ప్రధాన రహదారిలో రోడ్డు కాస్త బురదమయం తాండవిస్తుంది స్థానిక ప్రజలను వివరణ కోరగా చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉందని స్థానిక పంచాయతీ సెక్రెటరీ చంద్రమౌళికి తెలియజేశామని అయినప్పటికీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదని ప్రజలు మీడియాకు వివరించారు అసలే వర్షాకాలం ప్రారంభమైన వేల ప్రధాన రహదారి బురదమయం తాండవిస్తునడంతో చిన్నారులకు డెంగు మలేరియా వ్యాధిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు ఈ విషయమై స్థానిక పంచాయతీ సెక్రెటరీ చంద్రమౌళి మొబైల్ ద్వారా వివరణ అడగగా తాను నగదు వేయడానికి సిద్ధంగా ఉన్నానని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అడ్డుపడుతున్నారని విభిన్న వాదనలు చెప్పారు ఏది నిజం ఏది అబద్దం అనే విషయం అలా ఉంచితే వర్షాకాలంలో రోడ్డులన్నీ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానిక పంచాయతీ సెక్రెటరీ హెల్త్ కేర్ సిబ్బంది పర్యవేక్షణ ముఖ్యంగా గ్రామంలో ఉండాలి అయితే ఇక్కడ పంచాయతీ సెక్రెటరీ నిర్లక్ష్యం హెల్త్ కేర్ సిబ్బంది నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది స్థానిక మండల ఎంపీడీవో చొరవ తీసుకొని బురదమయమైన రోడ్లను మరమ్మత్తు చేయాలని స్థానిక ప్రజలు మీడియా ద్వారా తెలియజేశారు

