ఉరవకొండ, జూన్ 28:
ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో రహిత భద్రత కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
స్థానిక పోలియో చుక్కల కేంద్రంలో పిల్లలకు చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఏ ఎన్ యం అర్చన,ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ సరోజ పర్యవేక్షిస్తున్నారు. "నిండు జీవితానికి రెండు చుక్కలు" అనే నినాదంతో సాగుతున్న ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు తమ చిన్నారులను కేంద్రాలకు తీసుకువచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. పోలియో మహమ్మారిని దేశం నుండి పూర్తిగా తరిమికొట్టేందుకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమం ద్వారా ఎటువంటి లోపం లేకుండా అర్హులైన పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ప్రజలు మరియు ఆరోగ్యఅర్చన, సరోజ, ఆశా వర్కర్ సిబ్బంది ఉత్సాహం ఈ కార్యక్రమo లో పాల్గొన్నారు.

