ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పేరుతో ఘనంగాఎర్రి స్వామి తులాభారం


 

ఉరవకొండ, జూన్ 26: ఉరవకొండ మండలం, చిన్న ముష్టూరు గ్రామంలోని వన్నూరు స్వామి వారి సన్నిధిలో మొహర్రం సందర్భంగా గురువారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి కుటుంబ సభ్యుల తరపున భక్తులు పాల్గొన్నారు.

నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరామిరెడ్డిపై ఉన్న భక్తిభావంతో, చిన్న ముష్టూరు గ్రామానికి చెందిన ఎర్రిస్వామి అనే అభిమాని ఆయన కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం *80 కేజీల చక్కెరతో తులాభారం* వేసి మొక్కు చెల్లించుకున్నారు.

ప్రతి సంవత్సరం వన్నూరు స్వామికి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పేరు మీద తులాభారం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అభిమానులు మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.