అనంతపురం, రెడ్డిపల్లి— స్థానిక ఖుషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రైతు ప్రకృతి వ్యవసాయ అవగాహనా సదస్సులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) కిసాన్ మోర్చాకు సంబంధించి కీలక నియామకం జరిగింది. బెలుగుప్ప మండలం, అంకంపల్లి గ్రామానికి చెందిన గురు కృష్ణ యాదవ్‌ను జిల్లా సోలార్ సెల్ కన్వీనర్‌గా నియమిస్తూ, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి గారు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర, మరియు పలువురు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సదస్సులో, సోలార్ పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించే బాధ్యతను గురు కృష్ణ యాదవ్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
