సర్కారు నిర్లక్ష్యానికి 6 మంది గంగపుత్రులు బలి!


 


 కోటి రూపాయలు నష్ట పరిహారం,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి!

     ప్రాణాలకు తెగించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయంతో పాటు విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించి పెడుతున్న మత్స్యకారుల పట్ల కూటమి ప్రభుత్వం రాక్షసత్వంగా ప్రవర్తిస్తున్నది అని చెప్పడానికి నిన్నటి దినం బోటు బోల్తా పడి ఆరు మంది మత్స్యకారులు గల్లంతైన సంఘటనే నిలువెత్తు సాక్ష్యం.

    4వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు సంఘటన జరిగితే 5వ తేదీ ఉదయం 8 గంటల వరకు రెస్క్యూ ప్రారంభించలేదు.ఈ నిర్లక్ష్యమే 6 మంది మత్స్యకారులను బలి తీసుకుంది.గాలింపు ముగిసిందని ప్రకటించేసి చేతులు దులుపుకున్నారు.

    నాలుగో తేదీ రాత్రి 11:30 గంటలకు ప్రమాదం పై సమాచారం అందిందని వెంటనే మరుసటి రోజు ఉదయం గాలింపు చర్యలు ప్రారంభించామని మెరైన్ ఐజి గోపీనాథ్ జెట్టి చెబితే,మాకు ఐదో తేదీ ఉదయం సమాచారం వచ్చిందని వెంటనే రిస్క్యూ ఆపరేషన్ ప్రారంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మత్స్యశాఖ కమీషనర్ రామ్ శంకర్ నాయక్ పరస్పర విరుద్ధమైన మాటల వెనక ప్రభుత్వం నిర్లక్ష్యం కనబడుతుంది. 

    4 తేదీ శనివారం మధ్యాహ్నం3.30 గంటలకు బోటు బోల్తా పడింది.12 గంటల పాటు సముద్రంలో ఈది అలసిపోయి,తెల్లారే వరకు ఊపిరి బిగబట్టుకొని గాలించేందుకు రావాల్సిన బోటు వస్తుందని అంత వరకు బతికే ఉండాలని పాల్గొన్నారు,కానీ ఎవరూ రాలేదు.దూరంగా కనిపించిన చైనా షిప్ వద్దకు చేరుకునేసరికి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలు అయింది,కనీసం ఉదయం ఆరు ఏడు గంటలకైనా మా దగ్గరికి ఎవరైనా వచ్చి ఉంటే నలుగురైదుగురం బతికే వాళ్ళమని బోటు ప్రమాదంలో మృత్యుంజయుడుగా బయటపడిన కారు చిన్నా మాటలు కలిచి వేస్తాయి.

     4వ తేదీరాత్రి 8:30 గంటలకే రెవెన్యూ విభాగానికి సమాచారం వస్తే మరుసటి రోజు ఉదయం వరకు ఎందుకు రిస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టలేదు?అత్యంత కీలకమైన ఎనిమిది గంటలు ఎందుకు వృధా చేశారు? చీకట్లో సైతం గాలింపు చర్యలు చేపట్టే అత్యాధునిక రాడార్,హెలికాప్టర్ వ్యవస్థలు,కోర్టు కార్డు దళాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఎందుకు చేపట్టలేదు? వెంటనే రెస్క్యూ టీమ్ రంగంలో దిగి ఉంటే ఆ ఏడుగురు ఇప్పుడు వారి ఇళ్లలో ఉండేవారు కదా? మత్స్యకారుల ప్రాణాలకు విలువ లేదనే కదా? ఇదే ప్రమాదం ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులకు జరిగి ఉంటే ఇంత నిర్లక్ష్యం వహించేవారా?అని ఇదే ప్రమాదం నుంచి బయటపడిన చిన్నా అడుగుతున్నాడు ప్రభుత్వం సమాధానం చెప్పాలి.

     గల్లంతయిన మత్స్యకారుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పది లక్షల రూపాయలు పరిహారం అందించాలన్న ప్రభుత్వ ఆలోచన మంచిది కాదు.తోటి మత్స్యకారునికి న్యాయం చేయకుండా ఆప్ కాఫ్ చైర్మన్,మంత్రితో కలిసి హెలికాప్టర్లో వస్తున్న దృశ్యాలను మాధ్యమాలలో ప్రచారం చేసుకోవడం కాదు, కోటి రూపాయలు నష్టపరిహారం,కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి,జరిగిన ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి,సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.