ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఎస్ఎఫ్ఐ సమావేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు డిమాండ్లు చేశారు. డిగ్రీ అడ్మిషన్లను వెంటనే ఆఫ్‌లైన్ విధానంలో ప్రారంభించాలని, మేజర్–మైనర్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులు, మరుగుదొడ్లు, పీడీ (ఫిజికల్ డైరెక్టర్) నియామకం వంటి మౌలిక వసతులు కల్పించాలని, కళాశాల పనివేళలను పాత విధానంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎస్ఎఫ్ఐ నూతన ఉరవకొండ తాలూకా కమిటీని ఎన్నుకోగా, అధ్యక్షుడిగా ప్రవీణ్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.ఎం. హరూన్ రషీద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రాజేష్, కార్తీక్, సహాయ కార్యదర్శులుగా హేమంత్, నరసింహ, అంజి సహా 11 మంది కౌన్సిల్ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు.

