ఉరవకొండ ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ ఆయాలకు నియామక పత్రాల పంపిణీ


 


ఉరవకొండ, జూలై 3: ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ఐదు మండలాల నుంచి ఎంపికైన 23 మంది అంగన్‌వాడీ ఆయాలలో 19 మందికి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియామక పత్రాలను అందజేశారు.

అదే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు అందించిన కుక్కర్లను కూడా మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన అంగన్‌వాడీ ఆయాలకు శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మరింత నాణ్యమైన సేవలు అందేలా అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సాజిదా, ఉరవకొండ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి, సూపర్‌వైజర్లు అరుణ, ధనశేఖర్, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.