విద్యా సంస్థల బంద్ విజయవంతం SFI

 



నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి 


ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం. హరూన్ రషీద్, ఏఐవైఎఫ్ నాయకులు నవీన్ మాట్లాడుతూ.... 


ఉరవకొండ :- నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ ఈనెల 24వ తేదీన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ ఉరవకొండ నియోజకవర్గం లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది, 2014 నుండి దేశవ్యాప్తంగా 152 పరీక్షా పేపర్లు లీక్ అవ్వడం చాలా దౌర్భాగ్యం అని వారు మండిపడ్డారు, నీట్ పేపర్ లీకేజ్ కారణంగా దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు, నీట్ పేపర్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ, ప్రభుత్వం జవాబుదారీతనంగా వ్యవహరించాలని గత నెల రోజులుగా ఆందోళనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి , 20వ తేదీన లక్షలాది మంది విద్యార్థులు శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారు, విద్యార్థి, యువతపైన అత్యంత అమానవీయంగా లాఠీ చార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ను ఉపయోగించి వేలాదిమంది విద్యార్థులపై ఢిల్లీ పోలీస్ లు వ్యవహరించడం హేయమైన చర్య , ఒక విద్యార్థిని హాస్పిటల్లో వెంటిలేషన్ పైన ఉన్నారు, విద్యార్థుల ప్రజాస్వామ్యం కాపాడాలని, దేశ విద్యా వ్యవస్థలో సమూలమార్పులు కావాలని , నీట్ పరీక్షా విధానం రద్దుచేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ, నీట్ తదితర పరీక్ష పత్రాల లీకేజ్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండ నియోజకవర్గం లో రాష్ట్రవ్యాప్త బంద్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం. హారున్ రషీద్ ఎస్ఎఫ్ఐ ఉరవకొండ మండల అధ్యక్షుడు రాజేష్ ఏఐవైఎఫ్ నాయకులు నవీన్ అలాగే సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్న రాయుడు, సుల్తాన్, ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుమలేష్ సాయి మారుతి కార్తిక్ ప్రవీణ్ సుధీర్ లోకేష్ సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.