రాయదుర్గం నియోజకవర్గంలో బీజేపీ మహిళా మోర్చా మండల కమిటీల నియామకం:సౌభాగ్య శ్రీరామ్

రాయదుర్గం, ఆగస్టు 3: రాయదుర్గం నియోజకవర్గంలోని రాయదుర్గం పట్టణం, రాయదుర్గం రూరల్, గుమ్మగట్ట మండలాల భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మండల కమిటీల నియామక కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు.

రాయదుర్గంలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి సౌభాగ్య దగ్గుపాటి నూతన మండల కమిటీలను ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా రాయదుర్గం పట్టణ మహిళా మోర్చా మండల అధ్యక్షురాలిగా శ్రీమతి బి. మీనాక్షి, రాయదుర్గం రూరల్ మండల అధ్యక్షురాలిగా శ్రీమతి సువర్ణమ్మ, గుమ్మగట్ట మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా శ్రీమతి చంద్రకళలను నియమించారు.

కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీమతి అరుణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి హరిత, గుమ్మగట్ట మండల అధ్యక్షుడు రమేష్, రాయదుర్గం రూరల్ మండల అధ్యక్షుడు నాగరాజు, బీజేపీ సీనియర్ నాయకుడు జీవి నాని తదితరులు హాజరై నూతన కమిటీలకు అభినందనలు తెలిపారు.

అనంతరం మహిళా సాధికారత కోసం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని, మహిళలను మరింతగా రాజకీయంగా చైతన్యవంతులను చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యుడు శివానంద, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు కాంబ్లీ శివశంకర్, మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు డిష్ గోవిందు, వన్నూరప్ప, షబ్బీర్, జగతి కృష్ణ, కాసందుల కుమార్, నాయకుల పవన్, డాక్టర్ మల్లికార్జున, రేకులకుంట శ్రీనివాస్, డోణ తిమ్మప్ప, తిప్పేస్వామి, వీరభద్ర, ఎర్రిస్వామి, జగదీష్, శ్రీనివాసులు, డాక్టర్ బద్రీనాథ్, సత్యనారాయణతో పాటు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, మహిళా మోర్చా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా మోర్చా సభ్యులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.