16 న గణేష్ శోభా యాత్ర.యాడికి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి, రేపటి దినం అనగా 16.09.2026 వ తేదీన యాడికి మండలంలో నిర్వహించు గణేష్ శోభాయాత్ర మరియు గణేష్ ఉత్సవ విగ్రహాల నిమజ్జనం గురించి గణేష్ విగ్రహ పూజ నిర్వహణ భక్తులకు తెలియజేయడం ఏమనగా మండలంలోని చిన్న చిన్న విగ్రహాలు అనగా విగ్రహం ఎత్తు ఒక అడుగు నుండి సుమారు 5 అడుగులు ఉన్న విగ్రహాలను తే ర్నాంపల్లి గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో నిమజ్జనం చేసుకొనవలెను, మరియు పెద్ద విగ్రహాలను చీమల వాగుపల్లి గ్రామ సమీపం వద్ద ఉన్న నీటి కుంటలో నిమజ్జనం చేసుకొనవలెను. విగ్రహాల శోభయాత్ర జరుగు సమయంలో విగ్రహాలను తీసుకుని వెళ్ళు వాహనాలలో చిన్నపిల్లలను కూర్చుని పెట్టుకొనడం గాని మరియు వారిని నిమజ్జన ప్రదేశానికి తీసుకొని పోవటం గాని నిషేధము, అధిక ధ్వని కలిగించు పరికరాలను వాడకూడదు, కలుషిత రంగులను చల్లుకొనటం చేయరాదు, విగ్రహాల శుభయాత్రను ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి అతి త్వరగా నిమజ్జన కార్యక్రమమును పూర్తి చేయవలెను, ఈ కార్యక్రమము నిర్వహించే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా మీ యొక్క వాహనాలను సరైన క్రమంలో తీసుకుని వెళుతూ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించవలెను. ప్రజలు అందరూ ఐక్యత తో మరియు బాధ్యతాయుతంగా నెలకి యాడికి మండలమునకు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా ప్రవర్తించమని పోలీసులు యొక్క విజ్ఞప్తి. ఏదైనా అత్యవసర సమయము నందు పోలీసు సేవలను ఉపయోగించుకోవలెను మరియు ముఖ్య సమాచారం కొరకు ఇన్స్పెక్టర్ గారికి గాని యాడికి ఎస్ఐ గారికి గాని సమాచారం అందించమని కోరుతున్నాము. ఇట్లు యాడికి పోలీస్ సిబ్బంది.

 యాడికి మండలంలోని ప్రజలకు విజ్ఞప్తి, రేపటి దినం అనగా 16.09.2026 వ తేదీన యాడికి మండలంలో నిర్వహించు గణేష్ శోభాయాత్ర మరియు గణేష్ ఉత్సవ విగ్రహాల నిమజ్జనం గురించి గణేష్ విగ్రహ పూజ నిర్వహణ భక్తులకు తెలియజేయడం ఏమనగా మండలంలోని చిన్న చిన్న విగ్రహాలు అనగా విగ్రహం ఎత్తు ఒక అడుగు నుండి సుమారు 5 అడుగులు ఉన్న విగ్రహాలను తే ర్నాంపల్లి గ్రామ సమీపంలో ఉన్న నీటి కుంటలో నిమజ్జనం చేసుకొనవలెను, మరియు పెద్ద విగ్రహాలను చీమల వాగుపల్లి గ్రామ సమీపం వద్ద ఉన్న నీటి కుంటలో నిమజ్జనం చేసుకొనవలెను. విగ్రహాల శోభయాత్ర జరుగు సమయంలో విగ్రహాలను తీసుకుని వెళ్ళు వాహనాలలో చిన్నపిల్లలను కూర్చుని పెట్టుకొనడం గాని మరియు వారిని నిమజ్జన ప్రదేశానికి తీసుకొని పోవటం గాని నిషేధము, అధిక ధ్వని కలిగించు పరికరాలను వాడకూడదు, కలుషిత రంగులను చల్లుకొనటం చేయరాదు, విగ్రహాల శుభయాత్రను ఉదయం 10 గంటల నుంచి ప్రారంభించి అతి త్వరగా నిమజ్జన కార్యక్రమమును పూర్తి చేయవలెను, ఈ కార్యక్రమము నిర్వహించే సమయంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా మీ యొక్క వాహనాలను సరైన క్రమంలో తీసుకుని వెళుతూ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరించవలెను. ప్రజలు అందరూ ఐక్యత తో మరియు బాధ్యతాయుతంగా నెలకి యాడికి మండలమునకు మంచి పేరు తీసుకుని వచ్చే విధంగా ప్రవర్తించమని పోలీసులు యొక్క విజ్ఞప్తి. 

ఏదైనా అత్యవసర సమయము నందు పో


లీసు సేవలను ఉపయోగించుకోవలెను మరియు ముఖ్య సమాచారం కొరకు ఇన్స్పెక్టర్ గారికి గాని 

యాడికి ఎస్ఐ గారికి గాని సమాచారం అందించమని కోరుతున్నాము. 

ఇట్లు 

యాడికి పోలీస్ సిబ్బంది.