యాడికి
యాడికి మండలంలో కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలోని బాల వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించిన తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి ఈ సందర్భంగా జె.సి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు లభించాలని అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు అనంతరం ఆర్యవైశ్య ప్రతినిధులతో మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కూడా రాజకీయంగా ఎదగాలని పలువురు యువకులను జె.సి. ప్రభాకర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, మహిళా మండలి సభ్యులు, యువజన సంఘం సభ్యులు మరియు మండల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జె.సి. అభిమానులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
