ఉరవకొండ :
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని 10వ వార్డులో వేంచేసిన శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 26వ వార్షికోత్సవ గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా స్వామివారి దివ్య ప్రసాదాలు, పూజా సామగ్రికి నిర్వహించిన వేలం పాటలో భక్తులు పోటీపడి పాల్గొన్నారు.
వేలం పాటలో దక్కించుకున్న వివరాలు:
* మహా లడ్డు ప్రసాదం: కొమ్మసాని భాస్కర్ అత్యధికంగా ₹1,01,116/- సమర్పించి స్వామివారి లడ్డూను సొంతం చేసుకున్నారు.
* వెండి ఉంగరం, చైన్: ఆర్టీసీ డ్రైవర్ ఏళ్ల వెంకటేశ్వర్లు ₹31,116/- లకు పాడుకున్నారు.
* వెండి కడియం: మిట్ట పోషన్ కుమార్ ₹21,116/- లకు దక్కించుకున్నారు.
* శాలువా: చికెన్ సెంటర్ నాగరాజు ₹7,116/- లకు పాడుకున్నారు.
* కండువా: బుసన్న గారి నవీన్ ₹5,116/- లకు వేలంలో సొంతం చేసుకున్నారు.
ఉత్సవ సమితి సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవుని ఆశీస్సులు పొందిన విజేతలకు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.
