- అంతుచిక్కని వైరస్‌తో వారం రోజుల్లో 1,400 కోళ్లు మృతి?
ఉరవకొండ :
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కడమలకుంటలో అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు వరుసగా మృతి చెందుతుండటంతో కలకలం రేగింది. తాజాగా మరో 100 కోళ్లు మృతి చెందినట్లు సమాచారం. గత వారం రోజుల వ్యవధిలో సుమారు 1,400 కోళ్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. దీంతో పౌల్ట్రీ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది.
సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ అధికారులు, పశువైద్య నిపుణులు కడమలకుంటకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన కోళ్లను పరిశీలించడంతో పాటు నమూనాలను సేకరిస్తున్నారు. వాటిని ప్రయోగశాలలకు పంపించి పరీక్షలు నిర్వహించిన అనంతరం బర్డ్‌ఫ్లూ లేదా ఇతర వైరస్ కారణమా అన్నది నిర్ధారించనున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన ముందుస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, కోళ్లు మృతి చెందడంతో కొద్ది రోజుల్లోనే సుమారు రూ. 10 లక్షల నష్టం వాటిల్లిందని పౌల్ట్రీ యజమాని జయసింహ వేదన వ్యక్తం చేశారు.

