True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలు


కళ్యాణదుర్గం:కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పార్టీ అధిష్ఠానం ఖరారు చేసిన అభ్యర్థులు గురువారం అనంతపురంలోని జడ్పీ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు.

  • బ్రహ్మసముద్రం: పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి
  •  శెట్టూరు: ఎం.ఎస్. మాధవి
  • కళ్యాణదుర్గం రూరల్: యర్రంపల్లి గొల్ల కృష్ణవేణి
  •  కంబదూర్: బోయ అరుణ

తమకు జడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు, ప్రజాసేవకు అంకితమయ్యే ఈ గొప్ప అవకాశాన్ని కల్పించిన ప్రజానేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి అభ్యర్థులు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే తమపై నమ్మకముంచి ముందుకు నడిపించిన నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య , జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి  అభ్యర్థులు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రకటించారు. 

తమ నామినేషన్ల ప్రక్రియ విజయవంతం కావడానికి, అభ్యర్థులుగా తమకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ సహకరించిన ఆయా మండలాల వైసీపీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అభ్యర్థులు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అందరినీ కలుపుకొని పోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను నియోజకవర్గంలో మరింత ఎత్తున ఎగరేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

↑