ఉరవకొండ :పెన్నహోబిలం :శ్రీ ఉద్భవలక్ష్మి అమ్మవారి ఆలయంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వీర మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం దేవస్థానంలో యధావిధిగా సుప్రభాత సేవలు కుంకుమార్చనలు అభిషేకాలు జరిపించారు. అనంతరం అమ్మవారు భక్తులకు వీరలక్ష్మి గా దర్శనమిచ్చారు.
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అభిషేక పూజల్లో పాల్గొన్నారని ఈఓ సాకే రమేష్ బాబు, పూజారి మయూరం బాలాజీ తెలిపారు.

