True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంట :- ఇంచార్జి గౌతమ్ కుమార్

ఉరవకొండలో జనసేన స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ నియామకం

అసెంబ్లీ సమన్వయకర్తగా గౌతమ్ కుమార్.. పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేస్తామని వెల్లడి

ఉరవకొండ: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీలో అసెంబ్లీ సమన్వయకర్తగా నియోజకవర్గ ఇన్‌చార్జి గౌతమ్ కుమార్‌ను నియమించారు. కమిటీకి సంబంధించి నిర్వాహక సభ్యులు, సహాయక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా గౌతమ్ కుమార్ మాట్లాడుతూ.. పార్టీ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణతో, నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి, స్థానిక ఎన్నికల సమన్వయానికి నాయకులు, కార్యకర్తల సహకారంతో సమిష్టిగా పనిచేస్తామని పేర్కొన్నారు.

పార్టీ అధిష్ఠానం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల స్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చెప్పారు. పార్టీ అప్పగించిన బాధ్యతను గౌరవంగా స్వీకరిస్తూ, పార్టీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని స్పష్టం చేశారు.

జనసేన నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ స్థానిక ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

↑