True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

కౌకుంట్లలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు సునీత, యశోదమ్మ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసిన దృశ్యం.

కౌకుంట్లలో రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం

ఏకగ్రీవంగా ఎన్నికైన సునీత, యశోదమ్మ.. మంత్రి పయ్యావుల కేశవ్‌కు అభినందనల భేటీ

ఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామాలైన పెద్ద కౌకుంట్ల, చిన్న కౌకుంట్ల గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కౌకుంట్ల మొదటి ఎంపీటీసీ స్థానం నుంచి సునీత, రెండో ఎంపీటీసీ స్థానం నుంచి యశోదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ రెండు స్థానాలకు వైఎస్సార్‌సీపీ తరఫున ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా రిటర్నింగ్ అధికారి అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఈ సందర్భంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సునీత, యశోదమ్మ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వారిని మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు పెరుగుతోందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

↑