True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

రాష్ట్ర సమితి సభ్యుడిగా జి. సంతోష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎన్నికైన జి. సంతోష్ కుమార్

కడప, సెప్టెంబర్ 30: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సంతోష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప నగరంలో సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నిర్వహించిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల సందర్భంగా ఈ ఎన్నిక జరిగింది.

యువజన, విద్యార్థుల సమస్యలపై సంతోష్ కుమార్ నిరంతరం కార్యక్రమాలు, ఉద్యమాలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్యారంగ సమస్యలపై నిర్వహించిన ప్రజా ఉద్యమాల్లో ఆయన చురుకుగా పాల్గొన్నారని పేర్కొన్నాయి.

సంతోష్ కుమార్‌కు సీపీఐ రాష్ట్ర సమితిలో బాధ్యతలు అప్పగించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రాష్ట్ర స్థాయిలో యువజన, విద్యార్థి సమస్యలను మరింతగా ప్రస్తావించేందుకు ఈ బాధ్యత ఉపయోగపడుతుందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.

పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు

తనను సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి సభ్యులు, పార్టీ నాయకత్వానికి జి. సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ఆయన అన్నారు. యువత, విద్యార్థులు, కార్మికులు, రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరింత విస్తృతంగా ఉద్యమాలు నిర్వహిస్తానని తెలిపారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టే పోరాటాలను బలోపేతం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని సంతోష్ కుమార్ పేర్కొన్నారు.

↑