గోవాడ శివాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో బాధితుడు
గోవాడ, అక్టోబర్ 25:గోవాడ శివాలయం పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఓ కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో బాధితుడు స్పృహ కోల్పోయాడు.
క్షతగాత్రుడిని పంచాలవరం గ్రామానికి చెందిన దాసరి రవిగా గుర్తించారు.
అదే మార్గంలో వెళుతున్న వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు ప్రమాదాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.
అయితే, సమాచారం అందించిన 35 నిమిషాలైనా అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకోకపోవడంతో అశోక్ బాబు స్పందించారు. క్షతగాత్రుడిని తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు పోలీసుల అనుమతి కోరారు.
ఇంతలో బాధితుడిని కారులోకి ఎక్కించే సమయంలో అంబులెన్స్ ఘటనాస్థలానికి చేరుకుంది. దీంతో క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో చెరుకుపల్లిలోని సంజీవని వైద్యశాలకు తరలించారు.

