దుబాయ్‌లో అనంతపురం మేయర్ రమేష్ గౌడ్‌కు ఘన స్వాగతం
యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం, ఘన సన్మానం
అనంతపురం, ట్రూ టైమ్స్ ఇండియా: అనంతపురం నగర మేయర్‌గా ఎన్నికైన రమేష్ గౌడ్ దుబాయ్ పర్యటన సందర్భంగా యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనంతో పాటు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి మేయర్‌కు అభినందనలు తెలియజేశారు.
యూఏఈ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీరామ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దుబాయ్‌లోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రమేష్ గౌడ్‌ను సత్కరించారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం నగర మేయర్‌గా ఎన్నికైన రమేష్ గౌడ్‌కు అభినందనలు తెలియజేశారు. ఆయన రాజకీయ ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. నగర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన తనదైన పాత్ర పోషించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
విదేశాల్లో నివసిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర పరిచయాలు, ఆత్మీయ సంబంధాలను కొనసాగించడంతో పాటు పార్టీ కార్యక్రమాల్లో ఐక్యంగా ముందుకు సాగాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. ఈ ఆత్మీయ సమ్మేళనం యూఏఈలోని పార్టీ శ్రేణుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేసే వేదికగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో సత్తి ప్రసన్న సోమిరెడ్డి, శ్రీరామ్, బీరం సుధాకర్ రెడ్డి, రెడ్డయ్య రెడ్డి, శ్యామ్ రెడ్డి, జిలాన్ బాషా, తరపట్ల మోహన్, జహీర్, కోటేశ్వర రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, సోమశేఖర్, వేండ్ర శ్రీనివాస్, విజయభాస్కర్, ఫహీం, హనుమంతు రెడ్డి, అబ్దుల్లా, వెంకట రమణారెడ్డి, మనోహర్, నరేష్ చౌదరి, అక్రమ్, చక్రి, సుధాకర్ రెడ్డి, ఖలీల్, శ్రాజా రెడ్డి, సురేష్, తారక్, భరత్, గణపతి రాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

