True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఉరవకొండ గవిమఠం ఏజెంట్ పదవిని కురువ లాలెప్పకు కేటాయించాలి: మధుబాబు వినతి


 

ఉరవకొండ, ట్రూ టైమ్స్ ఇండియా:

ప్రముఖ ఆధ్యాత్మిక శైవ క్షేత్రమైన ఉరవకొండ శ్రీ గవిమఠం సంస్థానం 'ఏజెంట్' పదవిని సీనియర్ బీజేపీ నాయకులు కురువ లాలెప్ప (అలియాస్ బీజేపీ లాలెప్ప)కు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు, జిల్లా సమాచార హక్కు చట్టం కార్యదర్శి మీనుగ మధుబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఉన్నతాధికారులకు వినతిపత్రం పంపించారు.

ఈ సందర్భంగా మధుబాబు మాట్లాడుతూ.. గవిమఠానికి కురువ వంశస్థులు పూర్వం 56 ఎకరాల 30 సెంట్ల భూమిని ధారాదత్తం చేశారని, ప్రస్తుతం ఈ భూమి విలువ వేల కోట్ల రూపాయలు పలుకుతుందని గుర్తుచేశారు. ఎలాంటి మచ్చలేని నాయకుడిగా ప్రజల మన్ననలు పొందిన బీజేపీ లాలెప్పకు ఏజెంట్ పదవి అప్పగిస్తే, అది ఆ పదవికే అలంకారప్రాయమవుతుందని పేర్కొన్నారు.

ఆధ్యాత్మిక సేవకు, మఠాభివృద్ధికి కురువ లాలెప్ప అన్ని విధాలా యోగ్యుడని, ఆయనను మఠ సహాయకుడిగా నియమిస్తే మఠం సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారని మధుబాబు తన వినతిపత్రంలో ఆశాభావం వ్యక్తం చేశారు.


↑