True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో.


                            

ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు పుస్తకాల ప్రాధాన్యతపై అవగాహన

ఉరవకొండ: 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర గ్రంథాలయ శాఖ, జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఉరవకొండ శాఖా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలను ప్రదర్శించి విద్యార్థులకు పఠనంపై అవగాహన కల్పించారు.

‘చినిగిన చొక్కా అయినా తొడుక్కో.. ఒక మంచి పుస్తకం కొనుక్కో’ అనే నినాదంతో పుస్తకాల విలువ, ప్రాధాన్యతను వివరించారు. పుస్తకం మనిషికి మంచి నేస్తమని, చిన్నతనం నుంచే పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.

నేటి చరిత్రను భావితరాలకు అందించే అద్భుతమైన సాధనం పుస్తకమని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగిస్తూ జీవితంలో ముందుకు నడిపించే మార్గదర్శి పుస్తకమని ఈ సందర్భంగా వివరించారు.

వివిధ అంశాలపై పుస్తకాల ప్రదర్శన

ఈ ప్రదర్శనలో స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలు, విజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు, వినోదాత్మక రచనలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, కవితలు, కథల పుస్తకాలను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు ఆసక్తిగా పుస్తకాలను పరిశీలించారు.

గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి వై. ప్రతాపరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పఠన అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తక పఠనం విజ్ఞానాన్ని పెంచడమే కాకుండా మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు భీమన్న, సురేష్, ధనరాజు, కుమార్, విద్యార్థినీ విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


↑