True Times Indiaనిజమైన వార్తలు — నిర్భయమైన రిపోర్టింగ్
True Times India

తాజా తెలుగు వార్తలు | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | జాతీయం

తాజా వార్తతాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

బాల్య వివాహాలు నిర్మూలించండి సూపర్వైజర్ పుష్పావతి


  

విడపనకల్ (ట్రూ టైమ్స్ ఇండియా), నవంబర్ 21: విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలోని నాలుగవ అంగన్వాడీ కేంద్రాన్ని శనివారం అంగన్వాడీ సూపర్వైజర్ పుష్పావతి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్యవివాహాలను నిర్మూలించాలని అవగాహన కల్పించారు.లబ్ధిదారులకు పోషకాహారాన్ని పంపిణీ చేశారు.

అనంతరం చిన్నారుల బరువులు, ఎత్తుల కొలతలు, రక్తహీనత నివారణ, బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించడం వల్ల తల్లులు, శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, రక్తహీనతతో పాటు తక్కువ బరువుతో పిల్లలు పుట్టే ప్రమాదం ఉందని వివరించారు.

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ లబ్ధిదారులు, అంగన్వాడీ టీచర్ దుర్గాదేవి పాల్గొన్నారు.


↑