కేరళలో భారీ పేలుడు: 13 మంది మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

 TRUE TIMES INDIA
0

 కేరళలోని Thrissur జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడుతో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 40 మందికిపైగా కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి, భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం స్థానికులను కలచివేసింది.

ప్రాథమికంగా ఎండల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో తమిళనాడు లో జరిగిన ఇలాంటి ఘటనను మరువకముందే మరో ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ఘటనపై కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సహాయం ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!