ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభుత్వానికి మరియు సంస్థలకు ఆర్థికంగా మేలు చేకూర్చే దిశగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం అత్యంత అవసరమని పేర్కొన్నారు. సాంప్రదాయ విద్యుత్ వినియోగం వల్ల పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు, అలాగే కార్బన్ ఉద్గారాలను నియంత్రించేందుకు ఇటువంటి సోలార్ ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.
ఈ 100 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 400 నుండి 500 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికారులు వెల్లడించారు. దీనివల్ల యూనివర్సిటీకి సంవత్సరానికి దాదాపు రూ.10 లక్షల నుండి రూ.14 లక్షల వరకు విద్యుత్ బిల్లులపై ఆదా కలుగుతుందని అంచనా వేస్తున్నారు. దీని ద్వారా యూనివర్సిటీ ఆర్థిక భారం తగ్గడమే కాకుండా, పర్యావరణ హిత చర్యల్లో కూడా ముందంజలో నిలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను Canara Bank సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. బ్యాంకింగ్ రంగం నుండి విద్యా మరియు ఆరోగ్య రంగాలకు అందుతున్న సహకారం అభినందనీయమని మంత్రి అన్నారు.అలాగే, ఈ సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన M/s Eshaan Energy సంస్థ ప్రతినిధులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది కలిసి ఈ ప్రాజెక్ట్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వల్ల ఇది ఆదర్శ ప్రాజెక్ట్‌గా నిలుస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఈ తరహా ప్రాజెక్టులు రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ దిశగా ముందుకు నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


