దోమలు పుట్టకూడదు.. కుట్టకూడదు
శనివారం, ఏప్రిల్ 25, 2026
0
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెద్దకొట్టాలపల్లి పరిధిలోని వేల్పుమడుగు గ్రామంలో ఈరోజు ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం జరిగినది. దోమ పుట్టకూడదు దోమ కుట్టకూడదు అను నినాదంతో గ్రామ ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు, మలేరియా విషయం గురించి ప్రజలకు అవగాహన తెలిపి మలేరియా జ్వరం పై అప్రమత్తంగా ఉండమని తెలపడం జరిగింది . రాత్రిపూట దోమలు కుట్టకుండా దోమతెర వాడాలని తెలపడం జరిగింది . ఈ కార్యక్రమం నందు హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాసులు, ఏ ఎన్ ఎం లక్ష్మి ఆశా కార్యకర్తలు నాగమ్మ మహాలక్ష్మి మరియు గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది భీమేష్ రాము బాబు వీరందరూ పాల్గొన్నారు
