ఉరవకొండ పట్టణంలో అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు కోట్రేష్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నరాయుడు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా నూతన నియోజకవర్గ కమిటీని ప్రకటిస్తూ, హుస్సేన్ భాషను అధ్యక్షుడిగా, నవీన్ బాబును ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారు మాట్లాడుతూ, తమపై విశ్వాసం ఉంచిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేపడతామని చెప్పారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన కార్యవర్గం ఇలా ఉంది:
అధ్యక్షుడు: హుస్సేన్ భాష
ఉపాధ్యక్షులు: రఘు, మస్తాన్, బుదుగవి మధు ప్రధాన కార్యదర్శి: నవీన్ బాబు సహాయ కార్యదర్శులు: చందు, నాగరాజు, పండు, వేణు
కోశాధికారి: నెంగీ అంజి ఆహ్వానితుడు: నాగేంద్ర నాయక్
మొత్తం 11మంది కార్యవర్గ సభ్యులు, 1 ఆహ్వానితుడు, 23 మంది కౌన్సిల్ సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు మాట్లాడుతూ, ఎన్నికైన ప్రతీ సభ్యుడికి అభినందనలు తెలియజేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
