విద్యార్థి సమస్యలు పట్టించుకోకుండా సంబరాలా? ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వల్లరాజు మండిపాటు
అనంతపురంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్‌లో కూటమి ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై AISF రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా AISF రాష్ట్ర అధ్యక్షులు వల్లరాజు మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే వంద రోజుల్లో జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామని ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విస్మరించారని, పీజీ విద్యార్థులకు ఈ జీవో శాపంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరి విద్యార్థుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా మరమ్మతు నిధులు కేటాయించకుండా, ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. వైద్య విద్య ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, నీట్ పరీక్ష లీకేజీపై మంత్రి స్పందించకపోవడం దారుణమని, మౌలిక వసతులు, అర్హులైన అధ్యాపకులు లేక హైస్కూల్ ప్లస్ పాఠశాలలు కుదేలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యలపై పోరాట కార్యాచరణను రూపొందించేందుకు జూలై 1 నుంచి 4 వరకు కర్నూలులో నిర్వహించబోయే AISF రాష్ట్రస్థాయి శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు;
ఈ కార్యక్రమంలో తగ్గుపర్తి చందు,జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు రాయుడు, కుల్లాయి స్వామి, ఆంజనేయులు తదితర నాయకులు పాల్గొన్నారు.

