ఉరవకొండలో వెలిసిన తిరుమల శ్రీనివాసుడు: పంచముఖి క్షేత్రంలో వైభవంగా శనివార పూజలు

Malapati
0



 

ఉరవకొండ:ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న డ్రైవర్స్ కాలనీలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థాన ప్రాంగణం శనివారం భక్తిశ్రద్ధలతో పులకించిపోయింది. క్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శనివారం సందర్భంగా అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

పూజా విశేషాలు:

  కలియుగ దైవమైన శ్రీనివాసుడిని రంగురంగుల పుష్పమాలలతో, తులసీ దళాలతో అత్యంత నయనమనోహరంగా అలంకరించారు.

  వేకువజామునే స్వామివారికి సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు నిర్వహించి, భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపారు.

 ఆపద మొక్కులవాడిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

శ్రీవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు వినియోగించారు. పంచముఖి ఆంజనేయస్వామి, వేంకటేశ్వర స్వామివార్ల ఆశీస్సులతో కాలనీ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారని కమిటీ సభ్యులు ఎయిర్ టెల్ ప్రతాప్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)
Ok, Go it!