:బంజారాల సంస్కృతి సాంప్రదాయాలు దేశానికే ఆదర్శమని నేటి యువతరం సనాతన సాంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ శ్ర శ్రమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కల్చరర్ అండ్ ట్రెడిషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ పేర్కొన్నారు శనివారం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండా నందు సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట తండా వాసుల మధ్య బంజారాల సగాయి సోనేర్ పావ్ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా సింధు నాగరికత నుంచి మొదలైన బోర్ బంజారాల సాంప్రదాయాలు నేటికీ రూపా నాయక్ తండాలో కొనసాగుతుండడం అత్యంత గొప్ప విషయమని పూర్వికులు పాటించిన ఆదర్శవంతమైన నాగరికత కలిగిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి క్రమము తప్పకుండా చేయడం జరిగింది ముందుగా రాథోడ్ గోత్రానికి చెందిన అమ్మాయి ఇంటి వద్ద సోనేర్పావ్ కార్యక్రమం జరిగింది అనంతరం బంజారాల ఆరాధ్య దైవం దాఖల్ భూక్య మహారాజ్ ఆలయ సన్నిధిలో అనంతపురం సత్య సాయి జిల్లా వాసుల మధ్య సగాయి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం నంగరేర్ నాయక్ డావో కార్ భారీ డయాసాన్ వారి నేతృతంలో జరిగింది ఎస్.కె సుబ్రహ్మణ్యం నాయక్ ఉమాపతి నాయక్ కృష్ణా నాయక్ మాజీ జెడ్పిటిసి తులసీదాస నాయక్ రమావత్ లక్క నాయక్ పత్రు నాయక్ మాజీ విద్యా కమిటీ అధ్యక్షులు రమావత్ దేవల నాయక్ వన సంరక్షణ సమితి మాజీ అధ్యక్షులు పి పి వాల్యా నాయక్ విద్యా కమిటీ అధ్యక్షులు కే వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
బంజారా సంస్కృతి సాంప్రదాయాలు దేశానికి ఆదర్శం
ఆదివారం, మే 17, 2026
0



