ఉరవకొండ :ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) ఆధ్వర్యంలో, రేపు (జూన్ 21, 2026) అనంతపురంలోని హోటల్ SR గ్రాండ్ వేదికగా "సమాజంపై సోషల్ మీడియా ప్రభావం" అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నారు.
ఈ కీలక కార్యక్రమానికి ఆర్థిక,మంత్రి పయ్యావుల కేశవ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సెమినార్‌లో మీడియా రంగంలోని ప్రముఖులు, నిపుణులు పాల్గొని సోషల్ మీడియా వల్ల సమాజంలో వస్తున్న మార్పులు, ఎదురవుతున్న సవాళ్లపై విశ్లేషించనున్నారు.
ఉరవకొండ నుండి ప్రత్యేక వాహనం:
ఉరవకొండ ప్రాంతం నుండి ఈ సెమినార్‌కు హాజరయ్యే మీడియా మిత్రుల కోసం ప్రత్యేక వాహన సదుపాయం కల్పించబడింది. రేపు ఉదయం 8:00 గంటలకు ఉరవకొండ మండల పరిషత్ కార్యాలయం వద్దకు అందరూ చేరుకోవాల్సిందిగాసీనియర్ రిపోర్టర్ ఆనంద్ ఓ ప్రకటన లో కోరారు
