*ఉరవకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు కరపత్రాలు విడుదల
ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు
*ఉరవకొండ::: జులై 1 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు నగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణా తరగతులు జయప్రదం చేయాలని కోరుతూ ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అధికారంలోకి రాకముందు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా రాష్ట్రమంతా ఏదో పెద్ద చేశామన్న ఆనందంలో సంబరాలు చేసుకుంటున్నారు మాకు కావాల్సింది సంబరాలు కాదు విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే వంద రోజుల్లో పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే నేటికి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న ఇంతవరకు జీవో నెంబర్ 77 రద్దు చేయలేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పైన మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు సిద్ధలా వ్యవస్థలోకి చేరాయి విద్యార్థులు చదువుకుంటున్న సందర్భంలో పైన గోడలకు ఉన్నటువంటి పెచ్చులు ఊడి విద్యార్థుల తలలు పైలేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో కనబడతా ఉంది వాటి మరమ్మతుల కోసం నిధులు విడుదల చేసి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయకుండా కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్ర చట్టాన్ని పట్టణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఎంత వసూలు చేయాలని ఒక చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యులు దాన్ని పాటించకపోవడం లేదని మండిపడ్డారు.. వైద్య విద్యను ప్రైవేటీకరణ ఆపాలని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది పేద మధ్య తరగతి తల్లితండ్రులు తమ కూతుర్లు కొడుకులు మంచి కోచింగ్ కు పంపించి నీట్ పరీక్ష ర్యాంకు వస్తే డాక్టర్లు అవుతారన్న ఆనందం ఉంటే దేశవ్యాప్తంగా మొన్న జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్ష లీకైతే మన రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరైనది కాదని మండిపడ్డారు. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల బాధలు కష్టాలు మీకు అవసరం లేదా అని నారా లోకేష్ ను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా హైస్కూల్ ప్లస్ ఇంటర్ విద్యార్థికి సంబంధించి గర్ల్స్ కి 20094 పాఠశాలలకు గాను 250 పాఠశాలలోనే కొనసాగుతూ అబ్బాయిలకు సంబంధించి 210 పాఠశాలలకు గాను 114 పాఠశాలలు మాత్రమే కొనసాగుతూ ఇంటర్ పాస్ పర్సంటేజ్ 55 శాతానికి మించినటువంటి దయనీయ సమస్యలల్లో ఇంటర్ ప్లస్ పాఠశాల విద్యా విధానం కొనసాగుతున్న అర్హత ,అనుభవం లేని అధ్యాపకుల ద్వారా విద్యా బోధన చేయడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్య పైన దృష్టి పెట్టకుండా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు పైగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తున్నాము ముందుకు తీసుకెళుతున్నామని ప్రకటనలకే పరిమితమయ్యారు. జులై 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణ తరగతులలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన చర్చించి రాష్ట్రవ్యాప్తంగా సమరసిర పోరాటాలకు శ్రీకారం చూస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ కోశాధికారి రాజు ఉపాధ్యక్షులు రఘు నాయకులు సిద్ధిక్, నాగేష్, తదితర విద్యార్థులు పాల్గొన్నారు*
