పొలాన్ని,నీటిని సంరక్షించుకుందాం అధిక ఆదాయాన్ని
పొందుదాం* *ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధాకుమారి పొలాన్ని ,నీటిని సంరక్షించుకుని అధిక ఆదాయాన్ని పొందాలని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధాకుమారి రైతులకు సూచించారు.సోమవారం ఉరవకొండ మండల పరిధిలోని పెద్ద కౌకుంట్ల గ్రామంలో ఖేత్ బచావో అభియాన్ పొలం సంరక్షణ ప్రచార కార్యక్రమం రైతులతో కలిసి నిర్వహించి పోస్టర్లను ఆవిష్కరించారు.ఆచార్య ఎన్జీరంగా విశ్వవిద్యాలయం వారిచే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆరోగ్యకరమైన నేల,సమతుల్య ఎరువుల వినియోగం,అధిక దిగుబడులు,రైతుల శ్రేయస్సు అనే అంశాలపై ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించి రైతులలో వ్యవసాయ సాగు విధివిధానాలపై సామర్థ్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పొలం బాగుంటే రైతు బాగుంటాడు,రైతు బాగుంటే దేశం బాగుంటుందన్నారు.అందుకే రైతే రాజ అని గుర్తు చేశారు. పొలంలో నీటి సంరక్షణ పద్ధతులు పాటించి లోతు దుక్కలు చేసుకోవడం వలన ఎక్కువగా నీరు ఇంకిపోయి పంట బెట్ట పరిస్థితులను తట్టుకుంటుందన్నారు. ఎరువులు యొక్క ప్రాముఖ్యతను వాటి వినియోగాన్ని భూమి యొక్క సారవతాన్ని బట్టి వినియోగించుకోవాలని రైతులకు సూచించారు.మెట్ట వ్యవసాయమునకు అనువైన పంటలుగా వేరుసెనగ,ఆముదం,కంది,సజ్జ తదితర పంటలను సూచిస్తూ వాటి సాగు విధివిధానాలపై అవగాహన కల్పించారు.వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగు విధానంలో యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. కచ్చితంగా ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు చేయించి అనుకూలమైన లాభదాయకమైన పంటలు సాగు చేసుకోవాలన్నారు. పప్పు ధాన్యాల మిషన్,నూనె ధాన్యాల మిషన్, పత్తి దాన్యాల మిషన్ గురించి వివరిస్తూ వాటి ద్వారా రైతులకు అదనంగా వచ్చే ఆదాయం గురించి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్.లక్ష్మీ కళ్యాణి,డాక్టర్.నరసింహులు, ఆత్మ ఏటీఎం కిన్నెర,ఎంపీఈఓ.అంజి,రైతులు తదితరులు పాల్గొన్నారు.
