ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో జన్మదిన వేడుకలు - నిబంధనలకు తిలోదకాలు!జిల్లా సహచ కార్యదర్శి. మధుబాబు



 ప్రభుత్వ కార్యాలయమా.. వేడుకల వేదికనా?


*ఉరవకొండ:* ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ పథకాల అమలుకు కేంద్ర బిందువులుగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, నేడు కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల వివాదాలకు వేదికలుగా మారుతున్నాయని జిల్లా సహచ కార్యదర్శి మధుబాబు ఆరోపించారు.తాజాగా ఉరవకొండ ఎంపీడీఓ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలకు విరుద్ధంగా..

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేళల్లో అధికారిక విధులు నిర్వహించాలి. కానీ, ఇటీవల ఉరవకొండ ఎంపీడీఓ తన కార్యాలయంలో జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. అధికారిక చాంబర్‌లో సిబ్బంది మరియు అనుచరుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని మధు బాబు ఆరోపించారు.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇటువంటి వ్యక్తిగత వేడుకలను నిర్వహించడం ఏపీ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమని మేధావులు పేర్కొంటున్నారు.

ప్రజల సేవే ప్రధానం.. కానీ..

కార్యాలయ పనివేళల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. అటువంటి సమయంలో కార్యాలయంలో ఇలాంటి ఉత్సవాలు నిర్వహించడం వల్ల విధులు కుంటుపడటమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయ గౌరవానికి భంగం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను, కార్యాలయ స్థలాన్ని వ్యక్తిగత కార్యక్రమాలకు వాడుకోవడంపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

చర్యలు తప్పవా?

ఏపీ సివిల్ సర్వీసెస్ (క్లాసిఫికేషన్, కంట్రోల్ అండ్ అప్పీల్ - CCA) నిబంధనల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కార్యాలయ పవిత్రతను కాపాడాల్సిన వారే నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలుమధుబాబు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.