అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ సమాజంలో అవినీతి పట్ల కళ్లెం వేసే పాత్రికేయులపై అక్రమ కేసులు చెల్లవంటూ దేశ సుప్రీంకోర్టు తీర్పు పట్ల బంజారా సంఘం ప్రతినిధి రూపా నాయక్ తండా నంగరేయర్ నాయక్ ఎస్ కే సుబ్రహ్మణ్యం నాయక్ హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుత పరిస్థితుల్లో అక్రమాలకు పాల్పడుతున్న వారి కథనాలను పాత్రికేయులు ప్రచురిస్తే పరోక్షంగా విలేకరులపై అక్రమ కేసులు బనాయించడం రోజురోజుకీ అధికం కావడంతో పాత్రికేయ రంగం కూడా తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో వెనుకంజ వేసిన పరిస్థితి కనిపించింది ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టు పూర్వాపరాలను పరిశీలించి విలేకరులపై అక్రమ కేసులు చెల్లనిరవంటూ తీర్పు ఇవ్వడం అభినందనీయమని ఆనందం వ్యక్తం చేశారు
3/related/default
