ప్రజా సమస్య వేదికలో జిల్లా అధికారులకు వినతిపత్రం
అనంతపురం
అనంతపురం జిల్లాలోని చైతన్య, నారాయణ, ఎస్సార్ (SR), ఏజీఎస్ ఎరా (ERA), ఎడిఫై తదితర కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులు, తల్లిదండ్రులను తీవ్రంగా ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆరోపించింది.
విద్యా హక్కును వ్యాపారంగా మార్చి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నాయని జిల్లా కమిటీ పేర్కొంది.
ప్రభుత్వ అనుమతి లేకుండా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ నియమించి గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అనేక రెట్లు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నెలకు రూ.2,000 లోపు ఉండాల్సిన పాఠశాల ఫీజులను రూ.8,000 నుండి రూ.20,000 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హాస్టల్, మెస్ మరియు ఇతర సదుపాయాల పేరుతో విద్యార్థుల నుండి రూ.60,000 నుండి రూ.80,000 వరకు అదనపు భారం మోపుతున్నారని తెలిపారు.
జిల్లాలోని అన్ని కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేయాలి.
ఫీజుల దోపిడీ, నిబంధనల ఉల్లంఘనలపై సమగ్ర విచారణ జరపాలి.
అక్రమంగా వసూలు చేసిన ఫీజులను విద్యార్థులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
అనుమతులు లేని హాస్టళ్లు, విద్యాసంస్థలపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
విద్యను వ్యాపారంగా మార్చిన సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు చేపట్టాలి.
ఈ అంశాలపై జిల్లా కలెక్టర్కి వినతిపత్రం సమర్పించినట్లుతెలిపారు.విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామనిరాష్ట్ర నేత హెచ్చరించింది. సిద్దు
జిల్లా ప్రధానకార్యదర్శి
జి. వీరేంద్ర ప్రసాద్ హెచ్చ రించారు.
