ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం




ఉరవకొండ, జూన్ 21: 

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ శైలజ రాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రముఖ యోగా గురూజీ నాగమల్లి ఓబులేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామం మరియు వాటి ప్రయోజనాలను వివరించారు.

నిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రత పెరుగుతాయని ఓబులేష్ విద్యార్థులకు సూచించారు. యోగా రంగంలో విశేష సేవలు అందిస్తున్న నాగమల్లి ఓబులేష్‌ను కళాశాల యాజమాన్యం శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. మస్తాన్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.