హాస్పెట్ జూన్ 25
:కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర (టి.బి.) ప్రాజెక్ట్ నూతన గేట్ల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గేట్ నంబర్ 18 వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి, దెబ్బతిన్న పాత గేట్ల స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 స్పిల్‌వే గేట్లను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ శాలువాతో సన్మానించారు.
2024 ఆగస్టులో 19వ నంబర్ గేట్ వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన నేపథ్యంలో, నిపుణుల సూచనలు మరియు సాంకేతిక మార్గదర్శకత్వంతో ప్రాజెక్ట్‌లోని మొత్తం 33 గేట్లు, వాటి చైన్లను తొలగించి, అత్యంత వేగంగా పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన నిధులను సమకూర్చడంతో, కేవలం ఒకే సీజన్‌లో మొత్తం 33 నూతన గేట్లను విజయవంతంగా అమర్చి రికార్డు సృష్టించారు.
ఈ ప్రాజెక్టు పునరుద్ధరణతో తుంగభద్ర జలాశయం భద్రత బలోపేతం కావడంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లోని లక్షలాది మంది రైతులకు సాగునీటి భరోసా పెరిగింది.

