132 కేవీ సబ్‌స్టేషన్‌లో విద్యుత్ పనులు – రేపు మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేత:ఏ ఈ గురుమూర్తి

 



ఉరవకొండ, జూలై 10:

132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో అదనంగా 50 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనులు చేపట్టనున్న నేపథ్యంలో రేపు (11-07-2026) ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.

విద్యుత్ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడం, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పనులు చేపడుతున్నారు. ఈ కారణంగా సంబంధిత ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని రైతులు, గృహ వినియోగదారులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు మరియు పత్రికా విలేకర్లు గమనించి, విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు ఏ ఈగురుమూర్తి విడుదల చేసిన ఓ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.