జీవో నెం. 396 రద్దు చేసి ఉపాధిని కాపాడాలి: బి. కేశవరెడ్డి





దస్తావేజులేఖర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు సీపీఐ నాయకులు సోమవారం సంఘీభావం ప్రకటించారు. స్థానిక సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జరుగుతున్న సమ్మెలో పార్టీ నాయకులు పాల్గొని దస్తావేజులేఖర్లకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి. కేశవరెడ్డి మాట్లాడుతూ, దస్తావేజులేఖర్ల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం చూపే ప్రభుత్వ నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరారు. జీవో నెం. 396ను వెంటనే రద్దు చేసి వేలాది మంది దస్తావేజులేఖర్ల ఉపాధిని కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఒకవైపు ఉద్యోగాలు కల్పించకుండా, మరోవైపు ఉపాధిపై ఆధారపడి జీవిస్తున్న వారి కడుపు కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. ప్రజల జీవనోపాధికి భంగం కలిగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు, సహాయ కార్యదర్శి సుల్తాన్, పార్టీ నాయకులు మోహన్, గన్నె మల్లేష్, అషేన్ భాష, జిల్లా నాయకులు సూరి, బసవరాజు, మహిళా సంఘం నాయకులు, దస్తావేజులేఖర్లు, వెండర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా దస్తావేజులేఖర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.