వజ్రకరూరులో మాజీ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎం. దావీదు మృతి.. పలువురు నేతల నివాళి


 


వజ్రకరూరుజులై 6:

వజ్రకరూరు గ్రామానికి చెందిన మాజీ పంచాయతీరాజ్ శాఖ వర్క్ ఇన్‌స్పెక్టర్ ఎం. దావీదు ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటలకు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వజ్రకరూర్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఎం. మోనాలిసా తండ్రి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు నల్లబోతుల రాజు మామగారు.

దాదాపు 14 సంవత్సరాల పాటు పంచాయతీరాజ్ శాఖలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా వజ్రకరూరు మండలంలో సేవలందించిన దావీదు, తన స్నేహశీలత, మంచితనం, అందరితో కలిసిమెలిసి ఉండే స్వభావంతో ప్రజల అభిమానాన్ని పొందారు.


దావీదు మృతికి వజ్రకరూరు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సోమశేఖర్ రెడ్డి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు డిష్డి . సురేష్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లెల జగదీష్, మాజీ ఎంపీపీ తిప్పయ్య, ప్రజాసంఘాల నాయకులు సాకే హరి, నింబగల్లు గోపాల్, చిన్న రాయుడు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్యాపిలి కిష్ట, బీమా పురుషోత్తం, శ్రీరాములు, ఓబులేసు తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.


వారు దావీదు భౌతికకాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.