ఉరవకొండ నియోజకవర్గం... *ఏపీడబ్ల్యూజేఎఫ్ కమిటీ ఏకగ్రీవం*

 

- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా రేగటి భీమప్ప, పీవై సుంకన్న 

- గౌరవ అధ్యక్షులుగా మాలపాటి శ్రీనివాసులు

- రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పులివారి హరిప్రసాద్ 


 ఉరవకొండ  జూలై 7:


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్( ఏపీడబ్ల్యూజేఎఫ్ )

ఉరవకొండ నియోజకవర్గం కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలుగా ఆర్. భీమప్ప ( ఏపీ టుడే ), పీవై సుంకన్న( సాక్షి)లు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే నియోజకవర్గం గౌరవ అధ్యక్షులుగా మాలపాటి శ్రీనివాసులు, రాష్ట్ర కమిటీ సభ్యులుగా పులివారి హరిప్రసాద్ లు ఎన్నికయ్యారు. మంగళవారం నాడు ఉరవకొండ పట్టణంలోని లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో ఉరవకొండ నియోజకవర్గంలోని ఐదు మండలాల విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపటి రామాంజనేయులు ( ఐ న్యూస్ బ్యూరో), ఏపీడబ్ల్యూజేఎఫ్ సీనియర్ నాయకులు డాక్టర్ సూర్య ( 6 టీవీ బ్యూరో) హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉరవకొండ నియోజకవర్గం అధ్యక్షులుగా ఆర్. భీమప్ప, ఉపాధ్యక్షులుగా సాల్మన్ రాజ్ ( ప్రజాశక్తి ), వీరేష్ ( సాక్షి రూరల్), జీటీ పాల్ ( జనసూర్య శ్రీ), ప్రధాన కార్యదర్శిగా పీవై సుంకన్న ( సాక్షి ), కార్యదర్శులుగా సీహెచ్ ఓబులేసు ( వెటరన్ జర్నలిస్టు), బలరాం ( ఆర్ టీవీ ), మధుబాబు ( 7 ఎస్టీవీ ), కోశాధికారిగా మొహియుద్దీన్ ( బిగ్ టీవీ ), కార్యవర్గ సభ్యులుగా బాలచంద్ర ( జ్యోతి ), రాజేష్ ( జనసూర్య శ్రీ), రంగస్వామి ( సాక్షి ), కార్తీక్ ( వార్తా బలం ), నాగభూషణం ( నవ భూమి ), శ్యామ్ కిరణ్ ( వైఎస్ఆర్ టీవీ ), సంజప్ప ( ప్రజా సంక్షేమం మాస పత్రిక ), శివ ( సూర్య ), అఖిల్ ( గోదావరి డైలీ ), బి. రమేష్ ( లేపాక్షి టైమ్స్), బి. ఉమాపతి ( 6 టీవీ ) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే గౌరవ అధ్యక్షులుగా మాలపాటి శ్రీనివాసులు ( జన ప్రగతి ), ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పులివారి హరిప్రసాద్ ( అసోసియేట్ ఎడిటర్, ధర్మవిజేత ) లను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ఉరవకొండ,ఏం. రామాంజనేయులు జమీల్ ఏళ్ళ సాయి ,వజ్రకరూరు, విడపనకల్లు, బెలుగుప్ప, కూడేరు మండలాలకు చెందిన పాత్రికేయులు హాజరయ్యారు.