ఉరవకొండ, జూలై 10:
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (APWJF) ఉరవకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పి.వై. సుంకన్నను శుక్రవారం దళిత సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. మాదిగ రిజర్వేషన్ చైతన్య సమితి వ్యవస్థాపకులు వంకాయల గోవిందు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా సుంకన్న పత్రికా రంగంలో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. సమాజ చైతన్యం కోసం, ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించేలా ఆయన చేసిన రచనలు ఎంతో ప్రశంసనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం సుంకన్నకు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ చైతన్య సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్. వెంకటేశులు, దళిత సంఘాల నాయకులు అశ్వర్థ నారాయణ, ముష్టుర్ ఎర్రిస్వామి, వెలుగొండ ఓబయ్య, రేణుమాకులపల్లి సురేష్, సంజీవ, రాకెట్ల శ్రీరాములు, ఓబయ్య, వన్నూరు స్వామి, జల్లిపల్లి సురేంద్ర, షేక్షానపల్లి ఎహెజ్కేల్, చీకలగురికి ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
