డెంగీపై బ్రహ్మాస్త్రం.. క్యుడెంగా

*

*అందుబాటులోకి వ్యాధి నివారణ టీకా*


_ఢిల్లీ, జూలై 21: ప్రజారోగ్యానికి సవాలు విసురుతున్న 'డెంగీ' మహమ్మారి అంతానికి పరిష్కారం దొరికింది. డెంగీ నివారణకు దేశంలోనే తొలిసారి ఒక టీకా అందుబాటులోకి రాబోతోంది._

_జపాన్‌కు చెందిన ప్రముఖ బయోఫార్మా సంస్థ తకేడా అభివృద్ధి చేసిన 'క్యుడెంగా' వ్యాక్సిన్‌ (టీకా)ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతి మంజూరు చేసింది. ఈ విషయాన్ని తకేడా బయోఫార్మాసూటికల్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ ప్రకటించింది. 4 సంవత్సరాల వయసు నుంచి. 60 ఏళ్ల వయసు వారి వరకు అందరూ ఈ వ్యాక్సిన్‌ను తీసుకోవచ్చు. గతంలో డెంగీ వ్యాధి బారిన పడిన వారు సైతం, ఈ టీకా తీసుకోవడం ద్వారా భవిష్యత్‌లో దాన్నుంచి దీర్ఘకాలం పాటు రక్షణ పొందొచ్చు. ఎటువంటి ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. మూడు నెలల విరామంతో 0.5ఎంఎల్‌ చొప్పున రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. డెంగీలో నాలుగు ఉప రకాల (సెరోటైప్స్‌) నుంచి రక్షణనిస్తుంది. క్యుడెంగా వ్యాక్సిన్‌ను 2022లో ఆవిష్కరించగా, 43 దేశాలు (భారత్‌ సహా) అనుమతులు ఇచ్చాయి. ఇప్పటి